హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ చేరుకున్న పాక్ మంత్రి ముసద్దిక్ మసూద్

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న తొలి 'ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్'లో పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసద్దిక్ మసూద్ మాలిక్ 'పురానా ఖిలా'కు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ(SCO) వేదికగా మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక, నాగరికత సంబంధాల బలోపేతం లక్ష్యంగా సాగే ఈ ఫోరమ్‌లో పాక్ మంత్రి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.