హైదరాబాద్: 28°C
వార్తలు

అరుణాచల్ పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మక గౌరవం

అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు ప్రతిష్టాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్' అవార్డు దక్కింది. ఇటానగర్‌లోని బందర్‌దేవా పోలీస్ ట్రైనింగ్ అకాడమీ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు ఆయన ప్రెసిడెంట్స్ కలర్‌ను అందజేశారు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది.