మణిపూర్ చందేల్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతిచెందారు. 150 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సీఎం వై ఖేమ్‌చంద్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, విచారణకు ఆదేశించారు. మద్యం సేవించిన వారిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిని సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
వార్తలు
కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి


