బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని 12 వార్డులకూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి శిరోమణి (టీడీపీ మద్దతు) ఒక్కరే నామినేషన్ వేశారు. పరిశీలన అనంతరం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో రికార్డు


