హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

రాజుపాలెం మండలం కొండమూడు గ్రామానికి చెందిన దూదేకుల టిప్పు సుల్తాన్ (34) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది రెండు నెలలుగా భార్య దూరంగా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. రెండు రోజులుగా కుమారుడు కనిపించకపోవడంతో తల్లి ఇంటికి వెళ్లి చూడగా మృతిచెందిన స్థితిలో కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.