హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తమిళంలో ప్రమాణ స్వీకారం చేసిన మహిళ

చిత్తూరు జడ్పీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ZPTC మంజుల తమిళంలో ప్రమాణస్వీకారం చేశారు. తెలుగులో మాట్లాడటం సరిగా రాకపోవడంతో తమిళంలోనే ప్రమాణాన్ని పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో తమిళ భాషా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సభ్యురాలు తమిళంలో ప్రమాణం చేయడం గమనార్హం.