హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో కొనకళ్ల నారాయణరావు ఆపరేషన్

కృష్ణా: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం స్పెషల్ ICUలో నారాయణరావును ఉంచి వైద్యులు అబ్జర్వేషన్ చేస్తున్నారు.