హైదరాబాద్: 28°C
వ్యాపారం

రోజుకు రూ.5 వేలు చెల్లించండి.. SBIకి భారీ ఫైన్‌

హోమ్‌లోన్ చెల్లించినా వినియోగదారుడికి ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో విఫలమైన SBIకి భారీ ఫైన్ పడింది. యూపీకి చెందిన గుల్వీర్ సింగ్ 1997లో రుణం తీసుకుని 2019లో పూర్తిగా చెల్లించాడు. అయినప్పటికీ అతడికి ఆస్తిపత్రాలు ఇవ్వకపోవడంతో బాధితుడు అలీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో రుణం తీర్చిన రోజు నుంచి పత్రాలు తిరిగి ఇచ్చే వరకు బాధితుడికి రోజుకు రూ.5 వేల చొప్పున చెల్లించాలని తీర్పు ఇచ్చింది.