భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈసారి విక్రయాలు 22 శాతం పడిపోయినట్లు 'కౌంటర్ పాయింట్ రీసెర్చ్' వెల్లడించింది. ఫోన్ల ధరలు పెరగడం, పండుగ ఆఫర్లు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని తెలిపింది. మరోవైపు 21 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంస్థ అమ్మకాలు కేవలం 8 శాతమే తగ్గాయి.
వ్యాపారం
భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు


