కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ మెన్స్ హాస్టల్‌లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోరలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా హాస్టల్‌లో సరిపడా భోజనం అందడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఏడాదిగా చీఫ్ వార్డెన్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అల్పాహారంలో పురుగుల కలకలం


