ప్రకాశం: మార్కాపురంలోని ఎంఎస్ నగర్ రహదారిలో ఉన్న ఓ మొబైల్ షాపులో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే షాపులోని మొబైళ్లు, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొబైల్ షాపులో అగ్నిప్రమాదం


