హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవం అయిన బీకే పల్లి సర్పంచ్ ఎన్నిక

AKP: కోటవురట్ల మండలం బీకే పల్లి పంచాయితీ ఎన్నిక ఏకగ్రీవ అయింది. ఎస్సీ జనరల్‌కు కేటాయించిన పంచాయతీ సర్పంచ్ స్థానానికి టీడీపీకి చెందిన పెదపూడి లోవరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ఈ ఎన్నికను ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఉప సర్పంచ్ పదవిని వైసీపీకి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.