హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమాచారం ఇస్తున్నాడని హత్య.. నిందితుడు అరెస్ట్

కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన సంగాడి కామేశ్ హత్య కేసులో A-1 నిందితుడు పాలెపు సతీశ్‌ను అరెస్ట్ చేసినట్లు SI పి.సత్యనారాయణ తెలిపారు. తమ చోరీల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే అనుమానంతో గత నెల 28న కామేశ్‌ను అతడి స్నేహితులే సీతారామపురం కోలాటివారి రేవు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.