హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందుల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

KDP: పులివెందుల నుంచి శ్రీశైలం వెళ్లే శివభక్తుల కోసం ప్రత్యేక అల్ట్రా డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతి ఆదివారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు బస్సు బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమవుతుందని చెప్పారు. టికెట్ ధర రూ.650గా నిర్ణయించామని, ఆన్‌లైన్‌ బుకింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు.