కోనసీమ: క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శనివారం సాయంత్రం వాడపల్లి వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక గౌతమి గోదావరిలో హంస వాహనంపై స్వామివారిని ఉభయ దేవేరులతో కొలువుదీర్చనున్నారు. అనంతరం గోదావరి నదిలో స్వామివారు మూడుసార్లు విహరించనున్నారు. ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోదావరిలో వాడపల్లి స్వామి తెప్పోత్సవానికి ఏర్పాట్లు


