హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ ఆచూకీ కోసం వైసీపీ ధర్నా

NDL: పెద్దయమ్మనూరు ఎంపీటీసీ తలారి వెంకట రాముడు కిడ్నాప్ అయి 48 గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ భార్య లక్ష్మీదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెంకట రాముడి ఆచూకీ కనుగొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.