హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23న జాబ్ మేళా..!

PPM: పాలకొండలో ఈ నెల 23న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డీ.అప్పారావు తెలిపారు. జేకేసీ ఆధ్వర్యంలో మేళాలో గ్రాన్యూల్స్, వీల్స్ ఇండియా, కియా, టీవీఎస్ కంపెనీలు పాల్గొంటాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన 18-27 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. బయోడేటాతో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలి. వివరాలకు 7095731303కు సంప్రదించాలని కోరారు.