హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి'

KRNL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, సామాన్యులకు సత్వర న్యాయం అందించాలని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది కే. బలరాం కోరారు. స్టేషన్ బెయిల్ విధానంలో పారదర్శకత, లోక్ అదాలత్‌ల బలోపేతం, పూర్తిస్థాయి న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తప్పుడు కేసులను అరికట్టి న్యాయవ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.