PPM: వైద్య శిబిరాల ద్వారా ఆయుష్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. టీ.హేమాక్షి తెలిపారు. శుక్రవారం గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు దీర్ఘకాలిక, కాలానుగుణ వ్యాధులకు వైద్యులు పరీక్షలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తోటపల్లిలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం


