అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన షేక్ మహబూబ్ బాషా (30)పై ప్రభుత్వం పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలు గంజాయి కేసుల్లో 77 కిలోలకు పైగా గంజాయి పట్టుబడినా, జైలు నుంచి వచ్చాక మళ్లీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి స్మగ్లర్‌పై పిట్ ఎన్డీపీఎస్ చట్టం


