హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో మోసం.. ఏడాది జైలు శిక్ష

AKP: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసగించిన కేసులో అనకాపల్లి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్‌కు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. 2020లో ఎస్.రాయవరం పరిధిలో జరిగిన ఈ కేసును ఎస్పీ తుహిన్ సిన్హా దర్యాప్తు చేశారు. కేసు పరిష్కారంలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.