PPM: పార్వతీపురంలో శుక్రవారం జంఝావతి సాధన దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయని సాధన సమితి ప్రతినిధులు తెలిపారు. 60 రోజులుగా రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాతో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టాలని కోరారు. జంఝావతి సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
60వ రోజుకు చేరుకున్న జంఝావతి సాధన దీక్షలు


