కృష్ణా: గుడివాడ మండలం చౌటపల్లి గ్రామ సర్పంచ్‌తోపాటు, 10 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం అన్నారు. గ్రామ సర్పంచ్‌గా అట్లూరి సత్య ప్రభ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, గ్రామపంచాయతీలోని మొత్తం 10 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు జరగడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్కడ సర్పంచ్, వార్డులు ఏకగ్రీవం


