హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఫుడ్ సంస్థల సాంకేతిక నిపుణులకు శిక్షణ

విశాఖపట్నం ఎగుమతి తనిఖీ ఏజెన్సీ కార్యాలయంలో సీఫుడ్ సంస్థల సాంకేతిక నిపుణులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 16 నుంచి 20 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ, కెమికల్ టెస్టింగ్, HACCP, GMP తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ముగింపు సందర్భంగా పాల్గొన్న వారికి శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు.