హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

E.G: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన షేక్ మీరావలి, పాలిక రాజలక్ష్మి జనసేన పార్టీలో చేరారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో 12వ వార్డు కూటమి అభ్యర్థి చిక్కాల వీర వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారికి మంత్రి దుర్గేష్ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.