నెల్లూరు నగర ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ. నందన్, ఆర్‌డీడీ మధుకుమార్ సూచించారు. నగరంలో గుర్తించిన 566 అనధికార లేఅవుట్లలో 440కి అనుమతులు మంజూరు చేయగా, 1,919 ప్లాట్లకు యాజమాన్య హక్కులు లభించాయి. మరో 1,025 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నగర ప్రజలకు శుభవార్త


