హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: శ్రీముఖలింగంలో ఏకాదశి సందర్భంగా ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్నానని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం జలుమూరు మండలంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించానని చెప్పారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.