CTR: కుప్పం 132/33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రెస్కో ఎండీ సోమశేఖర్ తెలిపారు. బస్ లైన్ క్లియరెన్స్ పనుల నేపథ్యంలో కుప్పం, గుడుపల్లి మండలాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పలు మండలాల్లో పవర్ కట్


