హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురు అరెస్టు

KKD: గండేపల్లి మండలం జెడ్. రాగంపేట సమీపంలో ఎన్‌హెచ్‌-16పై లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 కేజీల హషీష్ ఆయిల్, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.67.80 లక్షలు అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.