హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొలిసారి కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం

మన్యం జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లా ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా జనసేన పార్టీకి చెందిన భామిని జడ్పీటీసీ సభ్యురాలు నీలమా నిమ్మల, వైస్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన కురుపాం జడ్పీటీసీ సభ్యుడు వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జేసీ అధ్యక్షతన ఈ ఎన్నిక జరిగింది.