హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా చూడి ఉలిగయ్య

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా కౌతాళం జడ్పీటీసీ సభ్యుడు చూడి ఉలిగయ్య, వైస్ ఛైర్మన్‌గా దేవనకొండ జడ్పీటీసీ సభ్యురాలు డా. సాధికా షేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ డా. సిరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.