హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా నవ్యశ్రీ బాధ్యతల స్వీకరణ

ఏలూరు జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ చింతమనేని నవ్యశ్రీ తెలిపారు. శుక్రవారం ఆమె ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.