హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పంచాయతీ నామినేషన్లలో ఉద్రిక్తత

PLD: సత్తెనపల్లి మండలం కొమరపూడి గ్రామంలో పంచాయతీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గార్లపాడు నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ నేతల పత్రాలను టీడీపీ వర్గీయులు లాక్కున్నారనే ఆరోపణలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి, అనంతరం వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు.