హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ఎఫెక్ట్.. జిల్లాలో అత్యధిక వర్షపాతం

SKLM: అక్వాన్ తుఫాన్ శుక్రవారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య గోపాలపూర్ సమీపంలో తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురంలో అత్యధికంగా 168.75 మి.మీ, అరకబద్రలో 162.50, కంచిలిలో 148.50 మి.మీ వర్షపాతం నమోదైంది. తీరంలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. తుఫాన్ బలహీనపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.