హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తింటి వేధింపులపై మహిళ ఫిర్యాదు

NTR: విజయవాడ కంసాలిపేటకు చెందిన జ్యోతికి 2021లో గుంటూరు జిల్లా నవులూరుకు చెందిన వంశీతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అత్తమామలు కూడా విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.