హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయంపూడి పంచాయతీ ఏకగ్రీవం

AKP: నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. సర్పంచ్‌గా టీడీపీకి చెందిన గోరింట వెంకటరమణ, ఉప సర్పంచ్‌గా రెడ్డి రమణతో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం హోంమంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలవగా, ఆమె వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.