ATP: పామిడి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక శుక్రవారం రెండోసారి వాయిదా పడినట్లు ప్రిసైడింగ్ అధికారి మొహమ్మద్ రఫీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన కోరం లేని కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి పామిడి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా


