హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో గుప్తనిధుల కోసం రహస్య తవ్వకాలు

KDP: బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఉన్న శ్రీవిద్య స్కూల్‌లో రాత్రివేళ రహస్యంగా తవ్వకాలు జరపడం కలకలం రేపింది. గత నాలుగు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను గమనించిన ఆరుగురు వ్యక్తులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.