నంద్యాల జిల్లా నూతన జడ్పీ ఛైర్మన్‌గా బనగానపల్లె ZPTC షేక్ బుర్హానుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయనతో జడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ బుర్హానుద్దీన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో MLAలు బుడ్డా, చరిత, జయసూర్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జడ్పీ ఛైర్మన్‌గా బుర్హానుద్దీన్ ఛార్జ్


