కోనసీమ: తాటిపాక బ్లోఅవుట్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఆయిల్, గ్యాస్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైరన్ వ్యవస్థ, మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలోని ఆయిల్, గ్యాస్ సంస్థలకు కలెక్టర్ కీలక ఆదేశాలు


