హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో మనోజ్ అన్నారు. శుక్రవారం ఉంగుటూరు పాతూరి కళ్యాణ మండపంలో అంగన్వాడీ, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 91 మంది ప్రిసైడింగ్ అధికారులు, 214 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు సహా మొత్తం 405 మందికి శిక్షణ ఇచ్చారు.