హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వేస్టేషన్‌లో వ్యక్తి మృతి ఆచూకి తెలిస్తే చెప్పండి

నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌లో మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎరుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.