కృష్ణ: గన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రంగబాబు, 12వ వార్డు అభ్యర్థి దేవరపల్లి విజయకుమారి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గన్నవరం అభివృద్ధికి కృషి చేస్తాం'


