NLR: ఉలవపాడు(M) కొల్లూరుపాడు సమీపంలోని ఫ్లైఓవర్‌పై శుక్రవారం దానిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి కలకత్తాకు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ తలకు గాయమైంది. దానిమ్మకాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉలవపాడులో ఫ్లైఓవర్‌పై పండ్ల లారీ బోల్తా


