హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరోసారి వాయిదా పడిన పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక

నంద్యాల జిల్లా పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. టీడీపీలోనే రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాయిదా పడింది. కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నిక జరగదు. కాగా.. 10 ఎంపీటీసీ స్థానాలకు గెలిచిన 9 టీడీపీ గెలిచింది. అయితే, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి వర్గీయులు తమ వారికే  పదవి రావాలని పట్టుబట్టడంతో ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది.