హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జెడ్పీ వైస్ ఛైర్మన్‌గా స్వాతి

అనకాపల్లి జెడ్పీ వైస్ ఛైర్మన్‌గా మునగపాక టీడీపీ జెడ్పీటీసీ పెంటకోట స్వాతి నేడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిషత్ కార్యాలయంలో ప్రక్రియ ముగిశాక సీఈఓ సత్యనారాయణ ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు. కూటమి నేతల సహకారంతో దక్కిన ఈ పదవికి న్యాయం చేస్తానని, అందరినీ కలుపుకొని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్వాతి పేర్కొన్నారు.