హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త ఆశయ సాధన కోసం ఎన్నికల బరిలో భార్య

KKD: కిర్లంపూడి మండలం జగపతినగరం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, దివంగత భర్త కాళ్ల దొంగబాబు సేవలను గుర్తుచేసుకుంటూ కాళ్ల భవాని భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త చిరకాల కోరికను నెరవేర్చేలా తనను ఆశీర్వదించి గెలిపించాలని గ్రామ ప్రజలను కన్నీటి పర్యంతమై కోరారు. ఎమ్మెల్యే నెహ్రూ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.