హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంకు ఉన్నా.. ఇంధనం కరువు!

ASR: రాజవొమ్మంగి మండల కేంద్రంలోని నయారా పెట్రోల్ బంకులో తరచూ ఇంధన కొరత ఏర్పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలలో రెండు మూడు సార్లు పెట్రోల్ అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.