హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

KDP: ప్రొద్దుటూరు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామేశ్వరం, దొరసానిపల్లె ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.. గత వారం రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు సాగిస్తున్నారు. వీరి ఆగడాలతో నదిలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకానికి చెందిన పైపులు బయటపడుతున్నాయి. ఇవి పగిలిపోతే గ్రామస్థులకు నీటి సరఫరా ఉండదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.