హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'భారీ కుంభకోణంపై అధికారులు దర్యాప్తు'

ప్రకాశం: ఒంగోలులో పశుసంవర్ధక శాఖలో రూ.8.80 కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసింది. సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకంలో నకిలీ లబ్ధిదారులు, డూప్లికేట్ గ్రూపుల పేర్లతో నిధులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ముగ్గురు అధికారులపై ఒంగోలు టూ‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ డైరెక్టర్ నాగమణి తెలిపారు.